No Confidence Vs Rahul : ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మంగళవారం రోజు కీలకంగా మారనుంది. మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేవు (ఆగస్టు 8) చర్చ మొదలుకానుంది. సరిగ్గా దీనికి ఒక్కరోజు ముందే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. లోక్ సభలో అవిశ్వాస చర్చను కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు అధికారపక్షం కూడా దీటుగా “ఇండియా”ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 10న ప్రధాని మోడీ సమాధానమిస్తారు.
Also read : 42 SITs : ఆ హింసపై ఇన్వెస్టిగేషన్ కు 42 సిట్ లు.. వాటిపై ఆరుగురు డీఐజీ ర్యాంక్ అధికారుల మానిటరింగ్
మోడీ ప్రభుత్వంపై అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చారు. దీనిని పరిశీలించిన స్పీకర్.. ఆగస్టు 8 నుంచి 10 వరకు (మూడురోజుల పాటు) చర్చ చేపట్టేందుకు సమయాన్ని నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రారంభమయ్యే చర్చను కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.