CM Revanth Reddy : గిగ్ వర్కర్ల చట్టం రూపకల్పనలో ప్రజా చర్చల ప్రాధాన్యతపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తయారుచేస్తున్న చట్ట ప్రతిపై, దీన్ని మరింత ప్రభావవంతంగా రూపొందించేందుకు ప్రజా చర్చలను నిర్వహించాలని ఓ సూచన చేయడానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు రాహుల్ గాంధీ. గత దశాబ్దంలో, లక్షలాది మంది కార్మికులు గిగ్ ఎకానమీలో చేరారని, తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో సైతం సులభంగా ప్రవేశించగల అవకాశం, వశ్యత కల్పించడం, ప్రారంభ దశలో అందించిన ప్రోత్సాహాలు అనేక మందికి ఆదాయ ఉత్పత్తి ఆస్తులను పొందడంలో సహాయపడ్డాయి. ఇది పెద్ద మార్కెట్‌ను పొందేందుకు వారికి వేదికగా నిలిచిందని ఆయన లేఖలో రాసుకొచ్చారు.
అంతేకాకుండా.. ఈ రంగంలో ఎంతోమంది కార్మికులు తమకు ఉపాధి అవకాశాలను పొందిన విజయకథలు ఉన్నాయి. అయితే, వారి ఉద్యోగ స్వరూపం కారణంగా వారు ఎదుర్కొంటున్న అసురక్షిత పరిస్థితుల గురించి అనేక సందర్భాల్లో వారు ప్రస్తావించారు. సరైన నియంత్రణల లేమి వారికి న్యాయమైన పని నిబంధనలను ఆశ్రయించే సామర్థ్యాన్ని మరింత తగ్గించిందన్నారు.
ప్రధాన సమస్యలు:
అన్యాయమైన పని పరిస్థితులు:
కార్మికులు ఎదుర్కొంటున్న నష్టనివారణల కొరత, అనుభవిస్తున్న అన్యాయాలు నియంత్రణలో లేకపోవడం వల్ల తీవ్రమవుతున్నాయి.
భేదభావం:
రోజువారి పనిలో సామాజిక వివక్ష , అమానుష ప్రవర్తన వంటి సమస్యలు వారికి ఎదురవుతున్నాయి.
హైదరాబాదులో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల సర్వేకు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన నాకు ప్రేరణగా నిలిచింది. ఈ చట్టానికి సంబంధించి కూడా అటువంటి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చర్చలు నిర్వహించాలని కోరుతున్నాను. అన్ని వర్గాల నుండి అభిప్రాయాలను పొందడం ద్వారా చట్టం మరింత సమర్థవంతం, సమగ్రమైనదిగా ఉంటుంది. నిర్మాణాత్మక చర్చల ద్వారా ఈ చట్టం గిగ్ ఎకానమీ భవిష్యత్తును మార్గదర్శకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియలో నేను కూడా పాల్గొనేందుకు సంతోషిస్తాను. తెలంగాణ గిగ్ ఎకానమీకి దారి చూపేలా చట్టాన్ని రూపకల్పన చేస్తుందని నా విశ్వాసం. మీ అభివృద్ధికి మా తరపున మద్దతు ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. అయితే.. ఈ లేఖను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. ‘రాహుల్ గాంధీజీ.. మా పని అంతా మీ విజన్, ఆలోచనలు, పని ద్వారా ప్రేరణ పొందింది. తెలంగాణ కులాల సర్వే మిమ్మల్ని గర్వపడేలా చేయడం మాకు మరింత శక్తినిస్తుంది. మేము మీ విజన్ & వాగ్దానాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, కలుపుకొని, న్యాయంగా , మార్గదర్శకంగా మారుస్తాము’ అని రాసుకొచ్చారు.
Dear @RahulGandhi Ji
All of our work is inspired by your vision, ideas and work. It gives us more energy that the Telangana Caste Survey has made you feel proud.
We will make the Telangana State Gig Workers’ Policy comprehensive, inclusive,fair and pioneering, in line with your… pic.twitter.com/dTjj2gM3f8
— Revanth Reddy (@revanth_anumula) November 20, 2024