Site icon HashtagU Telugu

Rahul Gift : అమ్మకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రాహుల్‌ గాంధీ

Rahul Gift

Rahul Gift

Rahul Gift : తన తల్లి సోనియాగాంధీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్క పిల్ల నూరీని సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. వరల్డ్‌ యానిమల్‌ డే సందర్భంగా రాహుల్ తన తల్లికి ఈ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆగస్టులో గోవా టూర్ కు వెళ్లిన రాహుల్.. అక్కడ ఓ కుక్కల పెంపకం కేంద్రాన్ని విజిట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలు రాహుల్ కు నచ్చాయి. దీంతో వాటిలో ఒకదాన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో కుక్కను కూడా తెప్పించుకున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో దీనికి సంబంధించిన   సీన్ లే ఉన్నాయి. ఓ చిన్న బాస్కెట్‌లో కుక్క పిల్ల నూరీని తీసుకెళ్లి సోనియాగాంధీకి రాహుల్ అందించారు. ఈ వీడియో నెటిజన్లను (Rahul Gift)  ఆకట్టుకుంటోంది.

Also read : James Anderson: భారత్‌ను ఓడించి ఇంగ్లండ్‌ ఛాంపియన్‌ అవుతుంది.. జోస్యం చెప్పిన అండర్సన్..!