Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?

తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ కీ ఊహించని షాక్ ఎదురయ్యింది. రాహుల్ గాంధీ పై అన‌ర్హ‌త వేటు

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 07:11 PM IST

తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ కీ ఊహించని షాక్ ఎదురయ్యింది. రాహుల్ గాంధీ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింద‌ని, రాహుల్ ఎంపీగా చెల్లుబాటు కార‌ంటూ లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే రాహుల్‌ గాంధీ అనర్హత వేటు పరిణామంపై బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తాజాగా స్పందించారు.

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటి రోజు అని తెలిపారు. కాగా రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్‌.. ఇది చీకటి రోజని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌ కు అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అని తెలుపుతూ అసహనం వ్యక్తం చేశారు. మోదీ పాలన ఎమర్జెనీని మించిపోతోంది. ప్రతిపక్ష నేతలకు వేధించడం బీజేపీకి పరిపాటిగా మారిందని, బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యలు అందరు ముక్త కంఠంతో ఖండించాలని కేసీఆర్‌ తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా స్పందించారు.

రాహుల్‌ గాంధీ పై వేటు అప్రజాస్వామికమం అని అన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమేనని, ఆ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్‌. అదేవిధంగా వీరితోపాటు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అన్యాయంగా రద్దు చేశారు. తమ వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ కుట్రకు దిగింది. ప్రతిపక్షాల అణచివేతలో మోదీ మిషన్‌ పెద్ద భాగం అని పేర్కొంది కవిత.