Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్‌లపై రాహుల్ ట్వీట్‌

దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్‌లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

  • Written By:
  • Publish Date - December 26, 2021 / 10:58 AM IST

దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్‌లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. బూస్ట‌ర్ డోస్ పై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో పేర్కోన్నారు.జనవరి 10 నుండి ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోస్ అందిస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రకటించారు.

డిసెంబరు 22న రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌లో దేశంలో బూస్టర్ డోస్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.దేశ‌ జనాభాలో ఎక్కువ మంది ఇప్పటికీ టీకాలు వేయలేదని.. కేంద్ర ప్ర‌భుత్వం బూస్టర్ డోస్ లు ఎప్పుడు ప్రారంభిస్తుంది?” అని రాహుల్ గాంధీ గ‌తంలో ట్వీట్ చేశారు. అయితే తాజాగా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌నతో ఆయ‌న సూచ‌న‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని..దీనిని స్వాగ‌తిస్తున్నాన‌ని రాహుల్ గాంధీ తెలిపారు.