కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, (Disqualified MP) పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన తర్వాత ట్విట్టర్ బయో మార్చేశారు. అనర్హత ఎంపిగా బయోను మార్చారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ ఇంటిపేరు మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోలో అనర్హత ఎంపీగా మార్చేసుకున్నారు.
కాగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఒక రోజు సంకల్ప సత్యాగ్రహం చేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలు, జిల్లాలో పార్టీ కార్యకర్తలు గాంధీ విగ్రహం ఎదుట దీక్షలు చేపట్టారు.
