Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra : జోడోయాత్ర‌లో బుల్లెట్ రైడ్ చేసిన రాహుల్ గాంధీ

Rahul On Bike

Rahul On Bike

రాహుల్ గాంధీ భార‌త్ జోడోయాత్ర ఉత్సాహ‌భ‌రితంగా సాగుతుంది. జోడోయాత్ర‌లో అంద‌రిని ప‌ల‌కరిస్తూ రాహుల్ త‌న యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బుల్లెట్ పై రైడ్ చేశారు.దీంతో జోడోయాత్ర‌లో ఉన్న కార్య‌క‌ర్త‌లు రాహుల్ బుల్లెట్ రైడ్‌ని సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించారు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.ఇటు జోడా యాత్ర ప్రచారం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వచ్చారు.