Jana Garjana Meeting: ఖమ్మంలో జన గర్జన సభాప్రాంగణానికి చేరుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ కు అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుండి హెలికాప్టర్‌లో ఖమ్మం జన గర్జనకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే రాహుల్ ఖమ్మంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదిరత నేతలు రాహుల్‌కు స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జనగర్జన సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వంద ఎకరాల్లో 5 లక్షల మంది సరిపడేలా భారీగా ఏర్పాట్లు చేశారు. జనగర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఇదే వేదికగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగియనుంది.
Read More: Tecno Pova 5: మార్కెట్ లోకి మరో టెక్నో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?