Site icon HashtagU Telugu

Rahul Gandhi Europe Trip: యూరప్ కు రాహుల్.. కీలక సమావేశానికి డుమ్మా!

Rahul

Rahul

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి, అదే రోజు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి హాజరయ్యేందుకు తిరిగి వస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రారంభం కానున్న “భారత్ జోడో యాత్ర” (యునైట్ ఇండియా క్యాంపెయిన్) కోసం ప్రణాళికలను రూపొందించడానికి కాంగ్రెస్ గురువారం సమావేశాన్ని నిర్వహించనుంది. దీనికి ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు. ఆ సమావేశానికి రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం నాయకత్వ ప్రశ్నపై ఊహాగానాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి.

మిస్టర్ రాహుల్ గాంధీ తరచుగా విదేశాలకు వెళుతున్నందుకు పలుసార్లు విమర్శలకు గురవుతున్నాడు. ఇది కొన్నిసార్లు ముఖ్యమైన కాంగ్రెస్ సమావేశాలపై ఎఫెక్ట్ కూడా పడుతోంది. ఇవన్నీ రాహుల్ గాంధీ నాయకత్వ నైపుణ్యాలను ప్రశ్నించడానికి దారితీస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరుస ఎన్నికల పరాజయాల తర్వాత తన పార్టీని పునరుద్ధరించడంలో జాతీయ పాత్రను చేపట్టాలనేది రాహుల్ ఉద్దేశ్యం. గత నెలలో కూడా ఆయన విదేశాల్లో ఉన్నారు. పార్టీ రాజ్యసభ నామినేషన్ల జాబితాలు ఆలస్యం కావడానికి ఇది కూడా ఓ కారణం. రాహుల్ విదేశాలకు వెళ్తున్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణను వాయిదా వేయవలసి వచ్చింది. గతంలో నేపాల్ రాహుల్ టూర్ వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే.