Site icon HashtagU Telugu

Raging : శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ ..ఐరన్ బాక్స్‌తో కాల్చిన తోటి విద్యార్థులు

Raging

Raging

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి మోరంపూడిలోని శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ (Raging) ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 10వ తరగతి చదువుతున్న గుర్రం విన్సెంట్ అనే విద్యార్థిపై అతని సహచర విద్యార్థులే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విన్సెంట్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.

Amazon vs Flipkart : అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్ షిప్ ఆఫర్.. కస్టమర్స్ కోసం సూపర్ డిస్కౌంట్ ఆఫర్స్

బాధితుడు విన్సెంట్ తనపై సహచర విద్యార్థులు అకారణంగా దాడి చేశారని ఆరోపించాడు. హాస్టల్‌లో సీనియర్ విద్యార్థుల నుంచి ర్యాగింగ్ ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విన్సెంట్ తల్లిదండ్రులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.

ఈ ర్యాగింగ్ ఘటన హాస్టల్ యాజమాన్యం పర్యవేక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థుల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా, ర్యాగింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. ఈ విషయంలో వారు నిర్లక్ష్యం వహించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు భద్రత కల్పించడంలో విద్యా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది.