Worl Cup 2023: చెలరేగి ఆడుతున్న కివీస్‌ బ్యాటర్లు

ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి

Worl Cup 2023: ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో బెయిర్‌స్టో (33), మలన్‌ (14), బ్రూక్‌ (25), అలీ (11), బట్లర్‌ (43), లివింగ్‌స్టోన్‌ (20) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు . ఈ క్రమంలో కివీస్‌ బౌలర్లను తట్టుకుని జో రూట్‌ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. ఇంగ్లండ్‌ తరఫున జో రూట్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. 77 పరుగుల వద్ద రూట్ ఔటయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 43 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన కివీస్‌.. బ్యాటింగ్‌లోనూ దుమ్ముదులుపుతోంది. 283 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసేసరికి డెవిన్‌ కాన్వే ( 106 ) సెంచరీతో చెలరేగగా.. రచిన్‌ రవీంద్ర భీకర బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. రచిన్ రవీంద్ర 82 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా రచిన్ నిలిచాడు. 27 ఓవర్లకు న్యూజిలాండ్‌ ఒక వికెట్‌ నష్టానికి 200 పరుగులు చేసింది. ఇంగ్లండ్ లాంటి బలమైన బౌలింగ్ ఎటాక్ ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ ముందు నిస్సహాయంగా కనిపిస్తోంది.

Also Read: Worl Cup 2023: చెలరేగి ఆడుతున్న కివీస్‌ బ్యాటర్లు