Site icon HashtagU Telugu

R Narayana Murthy: నారాయణమూర్తి ఇంట్లో విషాదం!

Narayana

Narayana

నటుడు ఆర్. నారాయణమూర్తి తల్లి ఇకలేరు. తల్లి చిట్టెమ్మ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 93. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో కన్నుమూశారు. నారాయణమూర్తి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చిట్టెమ్మ కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లం పేటలోని తన నివాసంలో ఈరోజు తుది శ్వాస విడిచింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. లెఫ్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది. రైతుల కష్టాలను వివరించే కొన్ని విప్లవాత్మక చిత్రాలను ఆయన నిర్మించారు. హిట్లు, ఫ్లాప్‌లు, లాభనష్టాలు పట్టించుకోకుండా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే ఉన్న ఫిల్మ్ మేకర్స్‌లో ఆయన ఒకరు.