KTR : తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. “ఉడుత ఊపులకు భయపడడం.. గుంపు మేస్త్రీ అంటే కట్టెటోడు.. కానీ ఇతను కూల్చేటోడు,” అని కేటీఆర్ ఆరోపించారు. పోరాటం అంటే బీఆర్ఎస్‌కు కొత్త ఏమి కాదని, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులతో కొట్లాడిన వారి గురించి ప్రస్తావించారు. “ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు,” అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ హక్కుల వాదనలో ఉన్న ఇతర వర్గాలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. “జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అశోక్ నగర్ పోతే చుట్టూ పోలీసులు ఉన్నారు,” అని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ భవన్‌కు వచ్చి, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
Study : ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు
“రేవంత్ రెడ్డి ఢిల్లికి 25 సార్లు వెళ్లిన వ్యక్తి,” అని కేటీఆర్ చెప్పారు. “తులం బంగారం గురించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే, రాష్ట్రంలో మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతున్నప్పుడు బీజేపీ మౌనంగా ఉంటుంది,” అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రంలో మరింత ప్రమాదకరమైన పార్టీగా పేర్కొన్న కేటీఆర్, “రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడాలి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సదస్సులు నిర్వహించాలి,” అని సూచించారు. “నా కంటే మంచి మాట్లాడే నాయకులు బీఆర్ఎస్‌లో ఉన్నారు,” అని తెలిపారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా, బ్యానర్ ఉండాలని, విద్యార్థులు పోరాటం చేయాలని కేటీఆర్ కోరారు. “మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుస్తున్నామని నమ్మడం మమ్మల్ని కొంప ముంచింది,” అని ఆయన చెప్పారు. “చిన్న చిన్న పొరపాట్లు చేశాం, వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం,” అని ఆయన సూచించారు. “విద్యార్థి నాయకులదే భవిష్యత్, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు, మన అందరిదీ,” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. “ఇంకో 50 నుంచి 75 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది,” అని ఆయన పేర్కొన్నారు.