Rahul Advice: ఎన్నికలు ముగుస్తున్నయ్.. మీ ట్యాంకులను ఫుల్ చేయించుకోండి!

యూపీ ఎన్నికలు సోమవారం ముగియడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఖరి ఓటింగ్ రోజుకు రెండు రోజుల ముందు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 11:35 PM IST

యూపీ ఎన్నికలు సోమవారం ముగియడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఖరి ఓటింగ్ రోజుకు రెండు రోజుల ముందు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలు తమ తమ పెట్రోల్  ట్యాంకులను నింపమని సలహా ఇచ్చారు. పెట్రోల్ ధరలు దూసుకుపోతాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “త్వరగా మీ ట్యాంకులను నింపండి. మోడీ ప్రభుత్వం ‘ఎన్నికల’ ఆఫర్ ముగియబోతోంది” అని ఆయన హిందీ ట్వీట్‌లో రాశారు.

ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను నియంత్రణలో ఉంచాయి. వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత పెంచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో వివాదం, ప్రతీకార పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఇంధనం సప్లయ్ చేసే రష్యా నుంచి పెట్రోల్, గ్యాస్, సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే భయంతో పెట్రోల్ ధరలను పెంచేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కొద్ది గంటల్లోనే వైరల్ గా మారడం విశేషం.