Earthquake in Tajikistan: తజికిస్థాన్ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు

తజికిస్థాన్‌లో బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ దీని గురించి సమాచారం ఇచ్చింది. తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9.16 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 12:54 PM IST

తజికిస్థాన్‌లో బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ దీని గురించి సమాచారం ఇచ్చింది. తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9.16 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంపం యొక్క లోతు 10 కి.మీ ఆ ప్రదేశం దుషాన్ బే అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

తజికిస్థాన్ రాజధాని దుషాన్ బేలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. దుషాన్ బేకు 171 కి.మీ దూరంలో.. 10 కి.మీ లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) ట్వీట్ చేసింది. ఈ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. కాగా, తజికిస్థాన్ లో భూకంపాలు ఎప్పటికప్పుడు సంభవిస్తుంటాయి.