గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది. సిస్మోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఆర్) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి(డబ్ల్యుఎస్‌డబ్ల్యు) 27 కి.మీ దూరంలో భూకంపం కేంద్రం అర్ధరాత్రి 12:52 గంటలకు నమోదైందని ఆయన చెప్పారు. “భూకంపం 5.2 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరాలో అరేబియా సముద్రంలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు’’ అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.
Also Read: Okaya EV: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 125 కి.మీ.. ఒకాయ ఈవీ ఫీచర్లు అదుర్స్..!
గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (GSDMA) ప్రకారం.. రాష్ట్రం అధిక భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 2001 కచ్ భూకంపంభారతదేశంలో మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.