Site icon HashtagU Telugu

PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!

Sindhu

Sindhu

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు నిఖిల్ నిశ్చితార్థ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన సింధు కూడా పాల్గొంది. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మళ్లీ తన లుక్ తో ఆకట్టుకున్నాడు. తెల్లటి షర్టుపై నల్లటి బ్లేజర్‌ను ధరించి స్సెషల్ అట్రాక్షన్ గా నిలవగా, మరోవైపు సింధు అందమైన లెహంగా ధరించింది. ఈ ఈవెంట్ లో సింధు అల్లు అర్జున్ తో కలిసి, నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫొజులిచ్చింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “స్టైలిష్ స్టార్ @alluarjunonlineతో.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటింది. ‘పుష్ప 2’ కోసం రెడీగా ఉన్నాడు.

Exit mobile version