Putins Chef-New Plan : పుతిన్ చెఫ్ కీలక ప్రకటన.. తన ప్రైవేట్ ఆర్మీ ఆఫ్రికా, బెలారస్‌ లలో కొనసాగుతుందని వెల్లడి

Putins Chef-New Plan : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తన ప్రైవేట్ ఆర్మీతో తిరుగుబాటు చేసి.. ఆ తర్వాత రాజీకి వచ్చిన వాగ్నర్‌ చీఫ్ ప్రిగోజిన్‌ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. 

Published By: HashtagU Telugu Desk
Russia Vs Wagner Group

Putins Chef-New Plan : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తన ప్రైవేట్ ఆర్మీతో తిరుగుబాటు చేసి.. ఆ తర్వాత రాజీకి వచ్చిన వాగ్నర్‌ చీఫ్ ప్రిగోజిన్‌ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు.  తాజాగా తన ప్రైవేట్ ఆర్మీ ఫ్యూచర్ ప్లాన్ పై బెలారస్ దేశం నుంచి కీలక ఆడియో  మెసేజ్ ను రిలీజ్ చేశాడు. దీన్ని గ్రేజోన్‌ అనే టెలిగ్రామ్‌ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఆఫ్రికా, బెలారస్‌ దేశాల్లో తన ప్రైవేట్ ఆర్మీ  కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రిగోజిన్‌  స్పష్టం చేశాడు. కాకపోతే ప్రస్తుతానికి వాగ్నర్‌ గ్రూప్ లో కొత్త నియామకాలను ఆపేశామన్నాడు.

Also read : Police Bike Stunts: పోలీస్ యూనిఫామ్ లో బైక్ పై స్టంట్స్.. అధికారులు ఏం చేశారో తెలుసా?

ఆఫ్రికా దేశాలు, బెలారస్‌ పై ఫోకస్.. 

ఆడియో  మెసేజ్ లో ప్రిగోజిన్‌ మాట్లాడుతూ.. ‘‘కొంత కాలంగా విపరీతంగా శ్రమించి ఉండటంతో చాలామంది వాగ్నర్‌ ఫైటర్లు సెలవుల్లో ఉన్నారు. వాగ్నర్‌ గ్రూప్‌ భవిష్యత్తు ప్రణాళికలను రెడీ చేశాం. ఇవి రష్యా ప్రతిష్ఠను మరింత పెంచుతాయి. ఆఫ్రికా దేశాల్లో, బెలారస్‌లోని శిక్షణ కేంద్రాల్లో మా గ్రూపు కార్యకలాపాలు చురుగ్గానే ఉంటాయి’’ అని వెల్లడించాడు. ప్రస్తుతం తమకు సిబ్బంది కొరత లేదని ప్రిగోజిన్‌(Putins Chef-New Plan) తేల్చి చెప్పాడు.

Also read : Muslims Should Give Solution : “జ్ఞానవాపి మసీదు ఒక చారిత్రక తప్పిదం.. దానికి ముస్లింలే పరిష్కారం చూపాలి”

ప్రస్తుతం వాగ్నర్‌ దళాలు ఎక్కడున్నాయి ?

ప్రస్తుతం వాగ్నర్‌ దళాలు బెలారస్‌లోని పాత సైనిక స్థావరాల్లో ఉన్నాయి. వాగ్నర్‌ దళాలు తమ దేశ సరిహద్దుకు చేరువగా వచ్చాయని పోలండ్‌ ప్రధాని మతౌజ్‌ మొరవియెకి ఇటీవల తెలిపారు. ఈయూ, నాటోలలో కూడా పోలండ్‌కు సభ్యత్వం ఉంది. రష్యాకు మిత్రదేశమైన బెలారస్‌తో, అటు ఉక్రెయిన్‌తో తమకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పోలండ్‌ ఆందోళన చెందుతోంది.

  Last Updated: 31 Jul 2023, 04:57 PM IST