Site icon HashtagU Telugu

No To G20 Vs Yes To China : జీ20 మీటింగ్ కు నో .. చైనా టూర్ కు ఓకే.. పుతిన్ కీలక నిర్ణయం

Whatsapp Image 2023 08 30 At 1.46.25 Pm

Whatsapp Image 2023 08 30 At 1.46.25 Pm

No To G20 Vs Yes To China : G20 మీటింగ్ కు రావాలని ఇండియా పిలిస్తే నో చెప్పిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. చైనా కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీన్నిబట్టి తోటి కమ్యూనిస్టు దేశంగా చైనాకు పుతిన్ ఇచ్చే విలువను అర్థం చేసుకోవచ్చు. చైనాను తమ నమ్మకమైన సైనిక భాగస్వామిగా భావిస్తుండటం వల్లే.. ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయిన ప్రస్తుత తరుణంలోనూ అక్కడికి వెళ్లేందుకు పుతిన్ రెడీ అవుతున్నారట. అక్టోబరులో చైనాలో జరగనున్న “బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్” సదస్సుకు పుతిన్ హాజరు కానున్నారు.

ఈమేరకు ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ వార్త విని భారత్ కొంత ఆవేదనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేసిన పుతిన్.. తాను G20 మీటింగ్ కు రాలేనని, తన బదులు దేశ విదేశాంగ మంత్రి లావ్రొవ్ ను పంపిస్తానని చెప్పారు. దౌత్య సంబంధాల విషయంలో ఇండియాతో ఒక రకంగా, చైనాతో ఇంకో రకంగా రష్యా ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా కుటిల నీతికి ఇది నిదర్శనమని విదేశాంగ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.

Also Read:  Paid Holiday To Workers: ఢిల్లీలో జీ20 సదస్సు ఎఫెక్ట్.. జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశం