Site icon HashtagU Telugu

Russia: ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ గురించి స్పందించిన పుతిన్?

Russia

Russia

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 17 నెలలుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని 20శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి పరస్పర దాడులు జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ దాడిలో ఎక్కువగా ఉక్రెయిన్‌ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది.. ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌ తో శాంతి చర్చలను తాము తోసిపుచ్చడంలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. అయితే, ఉక్రెయిన్‌ చేస్తున్న దాడులు ఈ ప్రక్రియలో ముందుడగు పడనీయవని అభిప్రాయపడ్డారు.

శాంతి చర్చలకు ఇరు దేశాల ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన రష్యా, ఆఫ్రికా సదస్సు అనంతరం పుతిన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి చర్చలు జరపాలని ఆఫ్రికా దేశాలు పుతిన్‌కు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చలు జరగాలని ఆఫ్రికా, చైనా వంటి దేశాలు కోరుకుంటున్నాయి. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఎప్పుడూ వ్యతిరేకించదు.

కానీ, ఉక్రెయిన్‌ సైన్యం ఇప్పుడు ఆక్రమణలకు దిగుతోంది. దీంతోపాటు భారీ స్థాయిలో వ్యూహాత్మక ఆపరేషన్లు చేపడుతోంది. ఒక పక్క వారు మాపై దాడులు చేస్తోంటే మేము కాల్పుల విరమణ ప్రకటించలేం అని పుతిన్‌ స్పష్టం చేశారు. ఇకపోతే ఈ విషయంపై జలెన్ స్కీ తెలుపుతూ మాట్లాడుతూ.. ఇప్పటికే ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆధీనంలో మా ఐదోవంతు భూభాగం ఉంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే, పుతిన్‌ బలగాలు తిరిగి బలోపేతం కావడానికి తగిన సమయం ఇచ్చినట్లు అవుతుంది అని జెలెన్‌ స్కీ తెలిపారు.

Exit mobile version