Site icon HashtagU Telugu

Putin War: ముగింపు దిశగా ‘రష్యా-ఉక్రెయిన్’ యుద్ధం!

Vladimir Putin

Vladimir Putin

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలు కావోస్తున్నా.. యుద్ధానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం నిలిచిపోతుందా? అని ఇతర దేశాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 9 నాటికి ఉక్రెయిన్‌పై అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించవచ్చు. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతుండటం, ఇతర దేశాలు ఆయుధ సాయం చేస్తుండటంతో పుతిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలున్నట్టు యూఎస్ లాంటి దేశాలు భావిస్తున్నాయి. మే 9న రష్యాలో “విక్టరీ డే” అని పిలుస్తారు.

1945లో దేశం నాజీలను ఓడించిన జ్ఞాపకార్థం ఈ వేడుకను జరుపుకుంటారు. ఉక్రెయిన్‌లో సైనిక విజయంగా భావించి ప్రకటన చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. రష్యా అధికారులు మే 9న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. “పుతిన్ తన ‘స్పెషల్ ఆపరేషన్’ నుంచి వెనక్కి తగ్గే ప్రయత్నిస్తాడని నేను భావిస్తున్నా” అంటూ UK రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ గత వారం మీడియాతో పేర్కొన్న నేపథ్యంలో యుద్ధానికి ముగింపు ఉంటుందని రెండు దేశాల పౌరులు భావిస్తున్నారు.