Site icon HashtagU Telugu

Putin Supports Trump :  ట్రంప్ కు పుతిన్ సపోర్ట్.. ఏమన్నారో తెలుసా ?

Putin supports Trump

Putin supports Trump

Putin Supports Trump : రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ కు సపోర్ట్ గా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ పై తీసుకుంటున్న చట్టపరమైన చర్యలను రాజకీయ ప్రేరేపిత చర్యగా పుతిన్ అభివర్ణించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ట్రంప్ ను వేధిస్తున్నట్టుగా అనిపిస్తోందని పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా పాలనా వ్యవస్థ గాడితప్పిన తీరుకు ఈ పరిణామాలు నిదర్శనమని చెప్పారు.

Also read : Delhi Game : చంద్ర‌బాబుకు`ఇండియా`అండ‌! ఢిల్లీకి జ‌గ‌న్ అందుకేనా..!

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా రష్యా పట్ల అమెరికా విదేశాంగ విధానంలో పెద్దగా మార్పు వస్తుందని తాను అనుకోవడం లేదని పుతిన్ (Putin Supports Trump) అన్నారు. సాధారణ అమెరికా ప్రజల్లో రష్యా వ్యతిరేక భావాలను నింపే కుటిల యత్నంలో ప్రస్తుత అమెరికా పాలకులు (బైడెన్) ఉన్నారని విమర్శించారు. అమెరికన్ సమాజాన్ని రష్యా వ్యతిరేక స్ఫూర్తితో నడిపిస్తుండటం సరికాదని పేర్కొన్నారు.