Russia Ukraine Crisis: వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్ రాజధాని పై బాంబుల వర్షం

  • Written By:
  • Updated On - February 24, 2022 / 10:02 AM IST

ఉక్రెయిన్‌, రష్యా మధ్య వార్ మొదలైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమైన నేప‌ధ్యంలో తాజాగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై మొదట ఫోకస్ పెట్టిన‌ రష్యా, ఉక్రెయిన్‌లో మూడువైపుల నుంచి దాడి ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా ఇప్పటికే మిలటరీ ఆపరేషన్ మొదలైందని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ స్పష్టం చేయ‌డం జ‌రిగింది.

ఈ నేప‌ధ్యంలో ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పుతిన్ పిలుపునిచ్చారు. రెండు దేశాల‌కు సంబంధించిన అంశం పై ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక‌ ఉక్రెయిన్‌లో నాలుగుచోట్ల మిస్సైల్ ఎటాక్స్‌ చేసింది రష్యా. ఈ క్ర‌మంలో డాడ్‌బస్‌లోకి రష్యా మిలటరీ చొచ్చుకెళ్లింది. ఉక్రెయిన్‌పై మూడువైపుల నుంచి దాడి ప్రారంభించిన ర రష్యా.. త్రిశూలవ్యూహంతో ఉక్రెయిన్‌ని చుట్టేసింది. మ‌రోవైపు నాటో, అమెరికా దేశాల హెచ్చరికలు రష్యా బేఖాతరు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇకపోతే ఇప్ప‌టికే ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య‌ వార్ నేప‌ధ్యంలో నెల‌రోజుల పాటు ఎమెర్జెన్సీ కొనసాగుతుందని ఉక్రెయిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.