Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి

అక్టోబర్‌లో బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సు (Belt and Road forum)కు మాత్రం పుతిన్ హాజరుకానున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Independent Candidate Putin

Putin Agrees To China Visit

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russian President Vladimir Putin) ఫై ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ జారీ అయినసంగతి తెలిసిందే. రష్యా దాడిలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు గానూ పుతిన్‌పై ఐసీసీ (ICC) అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో గత కొద్దీ నెలలుగా పుతిన్ బయటకు వెళ్లకుండా..రష్యాలోని గడుపుతున్నాడు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి పుతిన్‌ పొరుగున ఉన్న మునుపటి సోవియట్‌ యూనియన్‌ దేశాలు, ఇరాన్‌ తప్ప మరెక్కడికీ వెళ్లలేదు.

ఇటీవలే ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్నస్‌బ‌ర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల స‌మావేశాలకు కూడా హాజరుకాలేదు. వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా హాజరు కాలేనని , వర్చువల్‌గానే పాల్గొంటానని ఇప్పటికే ప్రధాని మోడీకి తెలిపినట్లు సమాచారం. అయితే అక్టోబర్‌లో బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సు (Belt and Road forum)కు మాత్రం పుతిన్ హాజరుకానున్నట్లు సమాచారం.

Read Also : Ante Sundaraniki : థ్రిల్లర్‌ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ ‘అంటే.. సుందరానికీ!’ తీయాల్సి వచ్చింది..

ఈ మేరకు సదస్సుకు హాజరుకావాలన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది. ఒకవేళ పుతిన్ సదస్సు కు హాజరైతే..ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న మొదటి విదేశీ పర్యటన ఇదే అవుతుంది. పుతిన్ ఏదైనా ఐసీసీ స‌భ్య దేశంలో అడుగుపెడితే, వెంటనే అత‌న్ని అరెస్టు చేయడం ఖాయం. కాకపోతే అరెస్ట్ వారెంట్‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి మాత్రం అంత‌ర్జాతీయ దేశాల స‌హ‌కారంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మరి ఇంతకాలం అరెస్ట్ చేస్తారనే భయంతో సొంత దేశంలోనే ఉన్న పుతిన్..ఇప్పుడు బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సు కు హాజరు అవుతారా..? అనేది చూడాలి.

  Last Updated: 30 Aug 2023, 10:04 PM IST