Site icon HashtagU Telugu

Pushpa : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీం

Pushpa 11

Pushpa 11

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి పుష్ప సక్సెస్ కావడంతో విజయోత్సవ వేడుకులను జరుపుకుంది. తాజాగా పుష్పటీం తిరుమల శ్రీవారి పుష్ప చిత్ర బృందం దర్శిచుకుంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పుష్ప మొదటి పార్ట్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ టీం త్వరలోనే రెండో పార్ట్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.

Exit mobile version