Red Sanders: ‘పుష్ప’ ప్లాన్ ఫెయిల్.. పోలీసులకు చిక్కిన స్మగ్లర్స్!

దొంగలు, ముఠాలు, స్మగ్లర్స్.. సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని రెచ్చిపోతున్నారు.

  • Written By:
  • Updated On - May 13, 2022 / 03:19 PM IST

దొంగలు, ముఠాలు, స్మగ్లర్స్.. సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని రెచ్చిపోతున్నారు. ఆయా సినిమాల్లోని సీన్స్ కు ప్రభావితమై.. అదే మాదిరిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా పుష్ప స్టైయిల్ ఎర్రచందనం తరలించాలనుకునే స్మగ్లర్లకు పోలీసులు చెక్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలిస్తున్న ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ రాకెట్‌ను రాచకొండ పోలీసులు ఛేదించారు. గురువారం అర్థరాత్రి మౌలా అలీ వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రూ.60 లక్షల విలువైన 1500 కిలోల ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వ్యక్తులు కడపకు చెందిన షేక్ మహ్మద్ రఫీ, సైనిక్‌పురికి చెందిన ఎం. బషీర్ అహ్మద్, ఇద్దరు అరటి వ్యాపారులు, ఏపీ స్థానికులు. కడప జిల్లాకు చెందిన మూర్తి పరారీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా అరటిపండ్లను సప్లయ్ చేసే నిందితులు ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. పుష్ప సినిమా మాదిరిగా స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు ఇసుకను విక్రయించిన మూర్తితో పరిచయం ఏర్పడింది.  ఇసుక లోడ్ లో ఎర్రచందనం దుంగలు తీసుకొచ్చి మల్కాజిగిరిలోని మౌలా అలీ వద్ద దాచారు.  కానీ పోలీసులు తెలివిగా వ్యవహరించారు. దుంగలను దాచిన ఆ స్థలంపై దాడి చేసి, ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.