Viral Video: వృద్ధురాలికి కుక్కపిల్ల చేసిన సహాయం చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

సాధారణంగా చాలామంది ఇళ్లలో అనేక రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఎక్కువమంది పెంచుకునే

  • Written By:
  • Updated On - October 27, 2022 / 05:05 PM IST

సాధారణంగా చాలామంది ఇళ్లలో అనేక రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఎక్కువమంది పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్క కూడా ఒకటి అని చెప్పవచ్చు. పెద్దపెద్ద నగరాలలో అయితే ప్రతి ఒక్కరు కూడా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ కుక్కల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ వాటికోసం కూడా లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాటిని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వాటికి డ్రెస్సులు వేయడం మంచి మంచి ఫుడ్ తినిపించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

అలాగే వాటికి హెల్త్ బాగోలేదు అంటే వాటికి సంబంధించిన హాస్పిటల్ కి వెళ్లి మరీ అందుకు తగిన చికిత్సలు కూడా చేయిస్తూ ఉంటారు. అయితే ఇతర జంతువులతో పోల్చుకుంటే మనిషికి, కుక్కలకు విడదీయలేని సంబంధం ఉంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇంట్లో కుక్క పిల్లలు కుక్కలు ఉంటే ఆ హడావిడి సందడి వేరేగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇంట్లో చిన్న కుక్క పిల్లలు ఉంటే ఆ ఇల్లు మొత్తం అల్లరి అల్లరి సందడి సందడిగా ఉంటుంది. ఆ చిన్న కుక్క పిల్లలు చేసే పనులు వాటి ప్రవర్తన ఒక్కొక్కసారి మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటుంది.

కొన్నిసార్లు ఆ కుక్క పిల్లలు తెలివిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పటికే అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కూడా సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కుక్క పిల్ల చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియోలో ఒక కుక్క పిల్ల, ఒక వృద్ధురాలు ఉన్నారు. వీడియోలు వృద్ధురాలు కూర్చోవాలి అనే ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న ఒక క్యూట్ కుక్కపిల్ల అని కూర్చోవడానికి పక్కనే ఉన్న స్టూల్ ని ఆమె కిందికి జరుపుతోంది. అలా ఆ చిన్న కుక్క పిల్ల స్టూల్ ని జరిపి ఆ వృద్ధురాలికి సహాయం చేసింది. దాని తెలివితేటలకు ఆ ఒక్క పిల్ల చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.