Punjabi Singer: పంజాబీ సింగర్ మూసేవాలా దారుణ హత్య

పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిధు మూసేవాలా(27) దారుణ హత్యకు గురయ్యారు.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 10:46 PM IST

పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిధు మూసేవాలా(27) దారుణ హత్యకు గురయ్యారు. ఆయనకు ఇస్తున్న భద్రతను పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం ఉప సంహరించుకొని 24 గంటలైనా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇద్దరు మిత్రులతో కలిసి థార్ జీపులో వెళ్తుండగా వాహనంపైకి కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రక్తమోడుతున్న ఆ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సిధు మూసేవాలా చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతడి స్వగ్రామం మన్సకు చెందిన ముఠా సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన్స అసెంబ్లీ స్థానం నుంచి మూసేవాలా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అతడిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి.