Kabbadi Player Shot Dead: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్ ను కాల్చి చంపిన దుండ‌గులు

జ‌లంధర్ జిల్లాలోని మాలియన్ గ్రామంలో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నంగల్ అంబియాన్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్‌ను దుండగులు కాల్చిచంపారు.

Published By: HashtagU Telugu Desk
Kabaddi player

Kabaddi player

చండీగ‌డ్ – జ‌లంధర్ జిల్లాలోని మాలియన్ గ్రామంలో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నంగల్ అంబియాన్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్‌ను దుండగులు కాల్చిచంపారు. కనీసం 20 బుల్లెట్లు అతని తల, ఛాతీలోకి దూసుకెళ్లాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. షాకోట్‌లోని నంగల్ అంబియాన్ గ్రామానికి చెందిన సందీప్ ప్రొఫెషనల్ సర్కిల్ కబడ్డీ ప్లేయర్ .. స్టాపర్ పొజిషన్‌లో ఆడాడు. అతను ఒక దశాబ్దానికి పైగా క‌బడ్డీ క్రీడను పాలించాడు. పంజాబ్ కాకుండా కెనడా, యూఎస్‌, యూకే లో కూడా ఆడాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో స్థిరపడిన సందీప్ సింగ్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సందీప్ ఈ ప్రాంతంలో సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్‌ల యొక్క అతిపెద్ద నిర్వాహకులలో ఒకరు. ఇంగ్లండ్‌లో స్థిరపడిన సందీప్ కొన్ని పెళ్లిళ్లకు, కబడ్డీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌కు వచ్చాడు.ఈ స‌మ‌యంలో మ్యాచ్ ఆడుతుండ‌గా దుండ‌గులు సందీప్ సింగ్ పై కాల్పులు జ‌ర‌ప‌గా ఆయ‌న మృతి చెందాడు. దీంతో ఆయ‌న అభిమానులంతా శోక‌సంద్రంలో మునిగిపోయారు.

  Last Updated: 15 Mar 2022, 08:55 AM IST