Site icon HashtagU Telugu

Punjab Farmer: లక్కీడ్రాలో రెండున్నర కోట్లు గెలుచుకున్న పేద రైతు

Punjab Farmer

Punjab Farmer

Punjab Farmer: పంజాబ్‌లోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. హోషియార్‌పూర్‌కు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. మహిల్‌పూర్ నగరానికి చెందిన శీతల్ సింగ్ అనే వ్యక్తి మెడిసిన్ కొనేందుకు మెడికల్ స్టోర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ కూడా కొన్నాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆ రైతుకు ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు. లాటరీ నిర్వాహకులు ఆ రైతుకు కాల్ చేసి మీరు రెండున్నర కోట్లు గెలుచుకున్నారని చెప్పారు. కానీ రైతు నమ్మలేదు. మళ్ళీ మళ్ళీ కాల్ చేసి లక్కీ డ్రాలో మీరు కొన్న టికెట్ వచ్చిందని చెప్పడంతో సదరు రైతు ఆనందానికి అవుదుల్లేకుండా పోయింది. దీంతో లాటరీలో వచ్చిన మొత్తాన్ని ఏమి చేయాలో తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని లాటరీ నిర్వాహకులకు చెప్పాడు. రైతుకు పెళ్లయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక లాటరీ యజమాని మాట్లాడుతూ.. తాను 15 ఏళ్ల నుంచి లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నానని, గతంలో మరో ఇద్దరు కోట్లాది రూపాయలు గెలుచుకున్నారని, ఇప్పుడు శీతల్ సింగ్ గెలుచుకున్నాడని తెలిపాడు.

Also Read: AP High Court : ఇసుక పాల‌సీ కేసులో చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ వాయిదా