Punjab CM : ఫేక్ డిగ్రీ అధికారుల‌పై పంజాబ్ సీఎం సీరియ‌స్‌

  • Written By:
  • Updated On - June 11, 2022 / 09:59 PM IST

ఫేక్ డిగ్రీల‌తో ఉద్యోగాలు పొందిన వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిద్ద‌మైయ్యారు. నకిలీ పట్టాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూర్చున్న రాజకీయ నాయకుల బంధువులు, పలుకుబడి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఫేక్ డిగ్రీల‌తో ఉద్యోగాలు పొందిన ఉన్న నాయ‌కుల‌ బంధువుల పేర్ల‌ను కూడా త్వరలో బయటపెట్టబోతున్నాన‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

ఇలాంటి చాలా కేసులు త‌న దృష్టికి వచ్చాయని.. . చాలా మంది రాజకీయ వ్యక్తుల బంధువులు నకిలీ డిగ్రీలతో ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నారని సీఎం మాన్ ట్వీట్ చేశారు. త్వరలో పంజాబ్ ప్రజల సొమ్మును ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని, అలాంటి వారిని బయటపెడతామని ఆయన సూచించారు. పంజాబ్ ప్రజల ప్రతి ఒక్క పన్ను సొమ్ము ప్రజల ఖాతాలోకి వెళ్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇటీవల పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అమన్‌దీప్ సింగ్ రిక్రూట్‌మెంట్‌లో మోసం వెలుగులోకి రావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఫేక్ డిగ్రీల‌తో ఉద్యోగాలు పొందిన మిగిలిన వారిపై సీఎం ఫోక‌స్ పెట్టారు.