Delhi Liquor Scam: తీహార్ జైలుకు పంజాబ్ సీఎం

ఆప్ కన్వీనర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో రెండోసారి తీహార్‌లో భేటీ కానున్నారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.

Published By: HashtagU Telugu Desk
Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేజ్రీవాల్ జైలులో ఉండగా ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రస్తుతం లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. తాజాగా కేజ్రీవాల్ పేరుపై ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేయగా ఎన్నికల కమిషన్ ఆ పాటని కూడా నిషేదించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా ఢిల్లీ సీఎంతో పంజాబ్ సీఎం భేటీ కానున్నారు.

We’re now on WhatsAppClick to Join

ఆప్ కన్వీనర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో రెండోసారి తీహార్‌లో భేటీ కానున్నారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఈ విధంగా భగవంత్ మాన్ రెండోసారి సీఎంను కలవనున్నారు. అంతకుముందు ఏప్రిల్ 15న ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అంతరం జైలులో పరిస్థితులు, సౌకర్యాలపై భ‌గ‌వంత్‌సింగ్‌ మాన్ మండిపడ్డారు. కరడుగట్టిన నేరగాళ్లకు అందుబాటులో ఉండే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్ కు ఇవ్వట్లేదని ఆరోపించారు ఆయన. పెద్ద టెర్రరిస్టుని బంధించినట్లు వ్యవహరిస్తున్నారని బీజాప్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Also Read: GT vs RCB: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. నిరాశపరిచిన గిల్

  Last Updated: 28 Apr 2024, 06:02 PM IST