Site icon HashtagU Telugu

Weapons To Telangana: పాకిస్థాన్ నుంచి తెలంగాణ‌కు ఆయుధాలు.. ?

Vehicle Imresizer

Vehicle Imresizer

తెలంగాణ‌లో పాక్ ఆయుధాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న అనుమానిత ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.దీంతో ఈ వ్య‌వ‌హారం అంతా బ‌య‌ట‌ప‌డింది. అరెస్ట్ చేసిన ఉగ్ర‌వాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు చేరవేయాల్సిందిగా నిందితులకు ఆదేశాలు అందినట్టు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందుతున్నాయని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తో పేలుడు ప‌దార్థాల‌ను పరిశీలిస్తున్నారు.