Site icon HashtagU Telugu

Punjab Politics : పంజాబ్ లో సింగ్ తో బీజేపీ కూట‌మి

Punjab Elections

Punjab Elections

మాజీ సీఎం అమ‌రేంద్ర‌సింగ్ పెట్టిన కొత్త పార్టీతో క‌లిసి బీజేపీ పోటీ చేయ‌నుంది. బీజేపీతో క‌లిసి ఎస్ఎడి కూడా పొత్తు పెట్టుకుంది. ఆ విష‌యాన్ని కేంద్రం మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ వెల్ల‌డించాడు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇటీవ‌ల అమ‌రేంద్ర‌సింగ్ స్థాపించిన విష‌యం విదిత‌మే. అలాగే, సుఖ్ దేవ్ సింగ్ ధిండాకు చెందిన ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తుతో పోటీ చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయిన సింగ్ మరియు ధిండా ఇద్దరూ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి షా నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ‌ అధ్యక్షుడు J.P. నడ్డా మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా BJP ఉన్నతాధికారులతో వాళ్లు సమావేశమయ్యారు.పంజాబ్‌లో జరిగే ఎన్నికల్లో బీజేపీ, సింగ్‌ పార్టీ, ధిండా పార్టీ సంయుక్తంగా పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.సమావేశం అనంతరం షెకావత్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అమరీందర్ సింగ్ పార్టీ, ధిండా పార్టీ సంయుక్తంగా పోటీ చేయనున్నాయని అధికారికంగా ప్రకటించడం జరిగింది. సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రతి పక్షం నుంచి ఇద్దరు నేతలతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని పంజాబ్‌కు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ షెకావత్ తెలిపారు. మూడు పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రూపొందిస్తుందని ఆయన ప్రకటించ‌డంతో పంజాబ్ ఎన్నిక‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు దారితీస్తోంది.