Site icon HashtagU Telugu

Helicopter ride for new born:పూణె రైతు సంచలనం…మనవరాలి కోసం హెలికాప్టర్ ..!!

Helicop

Helicop

ఆడపిల్ల పుట్టిందంటే కలత చెందే కుటుంబాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. మగపిల్లాడే వంశోద్ధారకుడని ఆరాటపడే కుటుంబాలు ఎన్నో. కానీ కొన్ని కుటుంబాలు అటువంటి నమ్మకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. లింగ సమానత్వాన్ని కోరుకునేవారు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఇలాంటి జాడ్యాన్ని పటాపంచలు చేస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేశాడు. తనకు మనవరాలు పుట్టిందని కుంగిపోలేదు. తన మనవరాలిని ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచించాడు.

తన మనవరాలిని ఇంటికి తీసుకొచ్చేందుకు ఆమెపై మమకారాన్ని వ్యక్తం చేస్తూ ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేశాడు.
తన కుమారిడికి కూతురు పుట్టిందని తెలియనగానే ఆ తాత సంతోషానికి అవదులేకుండా పోయాయి. ఆమెపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఎంతో తాపత్రాయపడ్డాడు. ఇందులో భాగంగానే తన ఇంటికి తొలిసారిగా వస్తున్న తన మనవరాలికి ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హెలికాప్టర్ పంపి తన మనవరాలిని మొదటిసారిగా ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో పూణె జిల్లా బాలెవాడి లో జరిగింది. బాలెవాడి ఏరియాకు చెందిన రైతు అజిత్ పాండు రంగ్ బాల్వాద్కర్ ఈ నిర్ణయం తీసుకుని సంచలనం క్రియేట్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.