Site icon HashtagU Telugu

Pulse Polio: ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం

Pulse Polio Andhra Pradesh

Pulse Polio Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 52,93,832 మంది పిల్లలకు టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం 37,969 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు.

సోమవారం నుంచి ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు చేశారు. హైరిస్క్ ప్రాంతాల కోసం 1,374 మొబైల్ టీమ్‌లను నియమించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే 13 జిల్లాలకు 66,95,000 డోస్‌లను సరఫరా చేసింది. వైద్య, స్త్రీ, శిశు సంక్షేమం, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమం, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2008 జూలై 16న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నమోదైంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు.