Dowry Harassment: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహహింస కేసు..!!

పుల్లారెడ్డి స్వీట్స్...తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ స్వీట్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

పుల్లారెడ్డి స్వీట్స్…తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ స్వీట్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ స్వీట్స్ ను జనాలు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. దివంగత పుల్లారెడ్డి స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగువారికి దగ్గరయ్యింది. ఇప్పుడు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఈ సంస్థకు చైర్మన్. తాజాగా వీరి కుటుంబంలో మనస్పర్థలు చెలరేగాయి. రాఘవరెడ్డి కుమారుడు, పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస చట్టం కింద పంజాగుట్టలోని పీఎస్ కేసు నమోదు అయ్యింది.

ఏక్ నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారి. గతకొంతకాలంగా ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను హింసిస్తున్నట్లు తెలుస్తోంది. భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదట. ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను కూడా నిర్మించారట. ఈ నేపథ్యంలో ఆయనపై వరకట్న వేధింపులు గృహహింస కేసులు నమోదు చేశారు. ఏక్ నాథ్ రెడ్డి భార్య కేసు పెట్టడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.

 

  Last Updated: 15 May 2022, 12:37 AM IST