Site icon HashtagU Telugu

Ravi Shastri: విరాట్ ఐపీల్ నుంచి తప్పుకో..

Kohli Ravi Shastry

Kohli Ravi Shastry

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.వెంటనే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలని సూచించారు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ సలహా కోహ్లికి మాత్రమే పరిమితం కాదని.. అతడిలా ఫామ్‌ లో లేకుండా పోయిన ఆటగాళ్లంతా ఐపీఎల్‌ నుంచి కొంతకాలం పాటు విరామం తీసుకుంటే మంచిదన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

గత కొన్నేళ్లుగా విరామం లేకుండా అన్ని ఫార్మాట్ల మ్యాచ్ లు ఆడుతున్న విరాట్ ఇక బ్రేక్ తీసుకోవడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఆరేడు ఏళ్ళు భారత జట్టు తరఫున ఆడాలంటే.. ఇప్పుడు ఐపీఎల్‌ నుంచి వైదొలగడమే మంచిదని ఆయన చెప్పారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున విరాట్‌ కోహ్లి ఆటతీరు బాగా లేదు. గత 9 మ్యాచ్ లలో కేవలం 128 పరుగులు చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ లో అత్యధికంగా 48 రన్స్ చేశాడు. మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ 9 రన్స్ చేశాడు. దీంతో కోహ్లి ఆటతీరుపై విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి.