Site icon HashtagU Telugu

Liger Public Talk:’లైగర్’.. టాక్ ఎలా ఉందంటే..!

Liger

Liger

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల తాజా చిత్రం ‘లైగర్’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఉదయం 7.30 గంటలకే స్క్రీన్లపై పడటంతో.. అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి.

ఓవరాల్ గా ఈ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఇవే:

‘లైగర్’ ఎక్సలెంట్ అంటూ కొందరు అంటున్నారు. ఒక రెజ్లర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమని, ఫైటింగ్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని చెపుతున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను అన్నీ తానై నడిపించాడని కితాబునిస్తున్నారు. హీరోయిన్ అనన్య పాండే చాలా హాట్ గా ఉందని చెపుతున్నారు. ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్ర బాగుందని అంటున్నారు.

మరికొందరు ఫస్ట్ హాఫ్ పర్వాలేదని… సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిందని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని, ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. కథలో బలం లేదని, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉందని చెపుతున్నారు.

తెలుగు సినిమాను బాలీవుడైజేషన్ చేశారంటూ ఇంకొందరు పెదవి విరిచారు. హిందీలో తీసిన సినిమాను తెలుగులో డబ్ చేశారని విమర్శిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని ఇది అగౌరవపరచడమేనని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ట్విట్టర్ టాక్ ను గమనిస్తే… ఈ సినిమాకు తొలి ఆటతో డివైడ్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. రాబోయే షోలతో ఈ సినిమాకు సంబంధించి పక్కా రివ్యూలు వస్తాయి.