BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై ప‌బ్లిక్ న్యూసెన్స్‌ కేసు

BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావుపై ప‌బ్లిక్ న్యూసెన్స్‌ కేసు న‌మోదైంది. సోమవారం ఔదయ్యనగర్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BRS ఎమ్మెల్యే అభ్య‌ర్థి అయినా టి. పద్మారావు గౌడ్‌పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ నివాసం దగ్గర అబ్దుల్ షఫీ నేతృత్వంలోని  పెద్ద ఎత్తున గుమిగూడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న సుమారు 150-200 మందిని పోలీసులు గుర్తించారు. కొందరు […]

Published By: HashtagU Telugu Desk
Kerala Police

Kerala Police

BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావుపై ప‌బ్లిక్ న్యూసెన్స్‌ కేసు న‌మోదైంది. సోమవారం ఔదయ్యనగర్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BRS ఎమ్మెల్యే అభ్య‌ర్థి అయినా టి. పద్మారావు గౌడ్‌పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ నివాసం దగ్గర అబ్దుల్ షఫీ నేతృత్వంలోని  పెద్ద ఎత్తున గుమిగూడినట్లు సమాచారం.

సంఘటనా స్థలానికి చేరుకున్న సుమారు 150-200 మందిని పోలీసులు గుర్తించారు. కొందరు BRS కండువాలు ధరించి, అనుమతి లేకుండా బీభత్సం సృష్టించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41-ఎ కింద కేసు నమోదు చేశామని, పద్మారావు గౌడ్, టి.కిరణ్ కుమార్ గౌడ్, టి.కిషోర్ కుమార్ గౌడ్, భువనగిరి కిరణ్ గౌడ్, ఎం దినేష్, మైసయ్యలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

  Last Updated: 28 Nov 2023, 08:58 AM IST