Deputy Mayor: ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన విన్నపాలు వెంటనే పరిష్కారం చేయాలని డిప్యూటీ మేయర్ (Deputy Mayor) శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ విన్నపాలను డిప్యూటీ మేయర్ స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీదారుని సమస్యను పరిష్కారం చేయటంలో అలసత్వం చేయవద్దని అధికారులను ఆదేశించారు. అర్జీదారునికి నిర్దేశించిన కాల వ్యవధిలో పరిష్కారం చేయాలన్నారు.
ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌తో పాటుగా అడిషనల్ కమిషనర్లు ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, రఘు ప్రసాద్, సుభద్ర దేవి, యాదగిరి రావు, సామ్రాట్ అశోక్, సత్యనారాయణ, వెణు గోపాల్ రెడ్డి, అడిషనల్ సీసీపీలు గంగాధర్, ప్రదీప్‌లు విన్నపాలను స్వీకరించారు.
Also Read: Minister Ponnam: మహారాష్ట్రలో తనదైన శైలిలో అదరగొట్టిన మంత్రి పొన్నం
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 117 విన్నపాలు వచ్చాయి. అందులో హెడ్ ఆఫీస్ లో 46 విన్నపాలలో టౌన్ ప్లానింగ్ 26, ఇంజనీరింగ్ 05, ట్యాక్స్ 09, యుబీడీ, శానిటేషన్, ఫైనాన్స్, హౌసింగ్ సంబంధించినవి ఒక్కొక్కటీ రాగా హెల్త్ 2 విన్నపాలు వచ్చాయి. కూకట్ పల్లి జోన్ లో 38, శేరిలింగంపల్లి 7, ఖైరతాబాద్ 2, ఎల్బీ నగర్ 07, చార్మినార్ 02, సికింద్రాబాద్ 15 విన్నపాలు వచ్చాయి. ఈ ప్రజావాణిలో హౌసింగ్ ఎస్ఈలు కృష్ణారావు, పీవీ రావు, రాజేశ్వర్ రావు, డిప్యూటీ సీఈ పనస రెడ్డి, వాటర్ వర్క్స్ జీఏం సాయి రమణ, సీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకిల్, ఎస్టేట్ అధికారి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కమిషనర్ మహేష్ కులకర్ణి, ఓఎస్‌డీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.