Site icon HashtagU Telugu

Attack on Russia : రష్యాలోని ఆరు ప్రాంతాలపై డ్రోన్ దాడులు.. నాలుగు విమానాలు దగ్ధం

Attack On Russia

Attack On Russia

Attack on Russia : రష్యాలోని 6 ప్రాంతాలపై బుధవారం తెల్లవారుజామున వరుస డ్రోన్ దాడులు జరిగాయి. పశ్చిమ పోస్కోవ్ ప్రాంతంలోని విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో ‘ఇల్యుషిన్‌ 76’ మోడల్ కు చెందిన  నాలుగు సైనిక రవాణా విమానాలు కాలిపోయి దెబ్బతిన్నాయని తెలిపింది. ఈనేపథ్యంలో ఇతర నగరాల నుంచి పోస్కోవ్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన విమాన సర్వీసులను తాత్కాలికంగా  రద్దు చేశామని చెప్పారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలను అదుపులోకి తెచ్చామని వివరించారు. ఈ డ్రోన్ దాడులను బలంగా తిప్పికొట్టామని పోస్కోవ్ గవర్నర్‌ మిఖాయిల్‌ వెడెర్నికోవ్‌ వెల్లడించారు. దీంతో పాటు మాస్కో, ఓరియోల్, బ్రయాన్స్క్, రియాజాన్, కలుగా ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి యత్నించాయని వెల్లడించింది.

Also read : INDIA PM Face Vs Kejriwal : కేజ్రీవాల్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి.. ‘ఇండియా’కు ఆప్ కొత్త డిమాండ్

పోస్కోవ్‌ సిటీ (Attack on Russia) ఉక్రెయిన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎస్తోనియా దేశ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది.అయితే ఈ దాడిని తామే చేశామని ఉక్రెయిన్ ఇంకా అంగీకరించలేదు.  ఇక మంగళవారం అర్థరాత్రి తర్వాత నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ పడవలపై పై రష్యా మిలిటరీ దాడి చేసిందని రష్యా అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 50 మందితో ఉన్న నాలుగు పడవలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బ్రయాన్స్క్‌లోని దక్షిణ ప్రాంతంపై మూడు ఉక్రెయిన్‌ డ్రోన్లను,  ఓరియోల్‌ ప్రాతంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్లు వెల్లడించారు.