Oberoi Hotels: భారతదేశంలోని హోటల్ పరిశ్రమలో సుపరిచితమైన పేరు, ఒబెరాయ్ హోటల్ (Oberoi Hotels) గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) కన్నుమూశారు. ఒబెరాయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ కుమారుడు పిఆర్‌ఎస్‌ను ‘బికీ’ అని కూడా పిలుస్తారు. అతను ఒబెరాయ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, EIH లిమిటెడ్ అతిపెద్ద వాటాదారు. PRS ఒబెరాయ్ ఏ సంస్థకైనా దాని ప్రజలే అత్యంత విలువైన ఆస్తి అని నమ్మాడు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో నాణ్యతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. ఆయనకి విక్రమ్ ఒబెరాయ్, నటాషా ఒబెరాయ్, అనస్తాసియా ఒబెరాయ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య పేరు గుడ్డి ఒబెరాయ్.
Also Read: MG Astor Price: 11 లక్షల కంటే తక్కువ ధరకే కారు.. అందుబాటులో అధునాతన భద్రతా ఫీచర్లు..!
PRS ఒబెరాయ్ ఎవరు..?
పీఆర్‌ఎస్ ఒబెరాయ్ 1929లో ఢిల్లీలో జన్మించారు. భారతదేశంతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్‌లో చదువుకున్నాడు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఒబెరాయ్ హోటళ్లను విలాసవంతమైనదిగా మార్చడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అనేక లగ్జరీ హోటళ్లను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయి హోటళ్ల వంటి సౌకర్యాలను అందించారు. 2008లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు.
We’re now on WhatsApp. Click to Join.
2012లో కేన్స్‌లో జరిగిన ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. మే 3, 2022న అతను EIH ఛైర్మన్, డైరెక్టర్ పదవిని విడిచిపెట్టాడు. కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. అతని అభిమానులు లేదా కంపెనీ వ్యక్తులు అతని అంత్యక్రియలకు హాజరుకావచ్చని, చివరి వీడ్కోలు చెప్పవచ్చని పేర్కొంది.
