Fertility Problems : సంతాన సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

పెళ్లయిన కొత్త దంపతులకు సంతానం కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయ్యి కొంచెం ఆలస్యమైనా కూడా తనలో ఏదో లోపం ఉంది అని తమకు సంతాన భాగ్యం ఉందా? లేదా?

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 08:00 AM IST

పెళ్లయిన కొత్త దంపతులకు సంతానం కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయ్యి కొంచెం ఆలస్యమైనా కూడా తనలో ఏదో లోపం ఉంది అని తమకు సంతాన భాగ్యం ఉందా? లేదా? అని వారిలో వారే సందేహాలతో ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. పిల్లలు కలగాలి అంటే భార్యభర్తలిద్దరీ పాత్ర ఉండాలి. మరీ ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాలు తగినన్ని ఉండడంతో పాటు ఆ వీర్య కణాలు ఆరోగ్యంగా చురుగ్గా కూడా ఉండాలి. అప్పుడే త్వరగా గర్భధారణ జరుగుతుంది. వీర్యకణాలు తక్కువగా ఉన్నా లేక ఆరోగ్యకరంగా లేకపోయినా సాధారణ గర్భధారణ అన్నది కలగానే మిగిలి పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

వీటితో పాటుగా గర్భధారణ జరిగి పోవడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగడం అధికంగా మద్యం సేవించడం వల్ల వీర్యం నాణ్యత దెబ్బతీస్తుంది. అందువల్ల సంతాన సాఫల్యత అవకాశాలపై వీటి ప్రభావం కచ్చితంగా పడుతుంది. తరచుగా ఆల్కహాల్ తాగే వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనితో అంగస్తంభన సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీర్యం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అలాగే పొగాకు లాంటి వాటి వల్ల కూడా వీర్యకణాల చలనశీలత డీఎన్ఏ కూడా దెబ్బతింటాయి. కాబట్టి పిల్లలు కలిగే వరకు వీటికి కొంచమైన దూరంగా ఉండటం మంచిది. ఒత్తిళ్ల సమస్య సంతానోత్పత్తికి ప్రతిబంధకంగా ఉండేలా చూడాలి.

అంగస్థంభన లేకపోవడం లైంగిక వాంఛ తగ్గడం వీర్య కణాలు తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఒత్తిళ్ల వల్ల వచ్చే సమస్యలు. సంతానం కలగని దంపతులు ముందుగా తాము ఒత్తిడి లో ఉన్నామా అన్నది పరిశీలించుకోవాలి. ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లు ప్రాణాయామం, యోగ, నడక వంటివి చేయడం వల్ల కొంచెం ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కూడా సంతానం ఆశించిన విధంగా జరుగుతుంది. తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా జీవనశైలి వ్యాధులు దూరంగా పెట్టుకోవచ్చు. వీటన్నిటితో పాటు గా వేడినీళ్ళ స్నానం కి దూరంగా ఉండాలి. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేయడం మానుకోవాలి. అండర్వేర్ లూజ్ గా ఉండేలా చూసుకోవాలి. టైట్ గా ఉండే ప్రాంతంలో ధరించకూడదు. అయితే పైన చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటించిన సంతానం కలగకపోతే అప్పుడు వైద్యులను సంప్రదించాలి.