Puvvada: ‘పీజీ మెడికల్ సీట్ల’ దందా అంటూ నాపై రేవంత్ రెడ్డి గవర్నర్ కు చేసిన తప్పుడు ఫిర్యాదును తీవ్రంగా ఖంఢిస్తున్నా – ‘మంత్రి పువ్వాడ’

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Published By: HashtagU Telugu Desk
Puvvada

Puvvada

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ‘‘ పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నా మీద గవర్నర్ కు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని తీవ్రంగా ఖంఢిస్తున్నా అన్నారు. ఖమ్మంలో గత 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీ లో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్న కౌన్సిలింగ్ అలాట్ మెంట్ సమయంలోనే మా కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయి..అలాంటప్పుడు మాకు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు.

ఇది పూర్తిగా నిరాధారం. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేదిలేదు. ఒక వేళ రేవంత్ రెడ్డి గనక నా కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్టు నిరూపిస్తే…నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తా…ఒకవేళ నిరూపంచలేని పక్షంలో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్ రెడ్డి సిద్ద పడాలి. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీ ప్రతిష్టను మంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడుతాం అని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

  Last Updated: 23 Apr 2022, 09:51 PM IST