హైదరాబాద్ (Hyderabad) లో వేశ్యలు (Prostitution ) రూట్ మార్చారు..మొన్నటి వరకు రూమ్ లలో, లేదా గెస్ట్ హౌస్ లలో , హోటల్స్ లలో వారి కార్యకలాపాలు చేసేవారు..కానీ ఇటీవల పోలీసుల దాడులు , చుట్టుపక్కల ఫ్యామిలీస్ గొడవ పెట్టడం, పోలీసులకు సమాచారం ఇస్తుండడంతో వారంతా రోడ్ల పైకి వచ్చి బేరాలు మాట్లాడుకొని , రహస్య ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. గతంలో ఇలాగే నడిపించేవాడు కానీ ఆ తర్వాత రూమ్స్ షిఫ్ట్ చేసుకున్నారు. కొంతమంది బ్రోకర్లతో కాంట్రాక్టు పెట్టుకొని వారే బేరాలు మాట్లాడుకొని తమ వద్దకు పంపించేలా చేసారు. కానీ ఇప్పుడు రూట్ మార్చుకొని రోడ్ల పైకి వచ్చి బేరాలు ఆడుతున్నారు. అయితే ఏ అర్ధరాత్రో వచ్చి బేరాలు మాట్లాడుకుంటే బాగుండు..కానీ రాత్రి 09 కాకముందేకే బస్ స్టాప్ లకు వచ్చి యువకులకు గాలం వేస్తున్నారు. రోజు రోజుకు వీరి ఆగడాలు ఎక్కవై పోతుండడం తో మిగత ఆడవారు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ మీడియా ఛానల్ వారు జరిపిన స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
రోడ్ల మీద విటులను ఆకర్షించి పక్కనే ఉన్న OYO హోటళ్ళు అడ్డాగా వీరి దందా నడుస్తున్నట్లు తేలింది. ఒక్కో వ్యక్తి నుండి రూ.500 నుండి రూ.2000 ల వరకు వసూళ్లు చేస్తున్నారు. ముందు రూ.5000 డిమాండ్ చేసి బేరాలు ఆడుతూ వచ్చాక లాస్ట్ రూ.2000 లకు ఫిక్స్ చేస్తున్నారు. కూకట్ పల్లి , SR నగర్ , మియాపూర్ , పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, కృష్ణానగర్, బాలాపూర్ వంటి ఏరియాల్లో స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ వీరు దందా నడిపిస్తున్నారు. ఇదంతా పోలీసులకు తెలియకుండా ఏమి నడుస్తలేదు. వారి మాములు వారికీ పంపిస్తుండడం తో వారంతా ఇదంతా చూసి చూడనట్లు పోతున్నారు. ఈ విషయాన్నీ స్వయమే వారే చెపుతున్నారు. మీరు ఏం భయపడకండి , ఇక్కడికి పోలీసులు ఏమి రారు..మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ చెపుతున్నారు. ఇక సామాన్య మహిళలు మాత్రం వీరి ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాప్ లలో కనీసం నిల్చులేకపోతున్నామని, తలదించుకోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.
Read Also : Principal : గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..సస్పండ్ చేయాలంటున్న విద్యార్థులు