Spicy Food: ఇండియన్స్ స్పైసీ ఫుడ్స్ నే ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ పై అస్సలు రాజీపడరు.

  • Written By:
  • Publish Date - February 16, 2022 / 10:06 AM IST

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ పై అస్సలు రాజీపడరు. కారంగా ఉన్నఆహారాన్నే భారతీయలు ఇష్టపడుతుంటారు. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తావానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే…ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణంగా కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి మంచితోపాటు చెడు కూడా అంతే ఉంటుంది. ఈ ఫుడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

వాపును తగ్గిస్తుంది…
మసాలాలు యాంటీ ఇన్ ఫ్లమేటర్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. తలనొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్, వికారం వంటి అనారోగ్య పరిస్థితులకు చికిత్స అందించడంలో ఇన్ ఫ్లమేటరీ ఆహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి…
పలు అధ్యయనాల ప్రకారం, మసాలా ఆహారాలు క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపుతాయని తేలింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో మసాలాలు బాగా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్ తీవ్రతను తగ్గిస్తాయి.

ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది….
మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ ను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. ఇది వ్యాధికారక భాగాలను తొలగించడంతో శరీరంలో ఇన్ఫెక్షన్లను నివారించేందుకు సహాయపడుతుంది.

జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు…
హార్వర్డ్ మరియు చైనాలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం ప్రకారం…మసాలా దినుసులను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ప్రజలు జీవిత కాలం పెరుగుతుందని వెల్లడించాయి.

జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు….
మసాలా దినుసులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం చేత శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

స్పైసీ ఫుడ్స్ తో నష్టాలు…
మసాలా ఫుడ్స్ వ్యక్తుల జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎక్కువగా స్పైసీగా ఉన్న ఫుడ్స్ ను ఇష్టపడితే…కొంత మంది తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎక్కువగా స్పైసీగా ఫుడ్స్ ను తీసుకున్నట్లయితే…జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంటుంది. టెస్టింగ్ బడ్స్ కు హానికలిగించవచ్చు. అందుకే మసాలా ఫుడ్స్ ను మితంగా తీసుకోవడం మంచిది.