Site icon HashtagU Telugu

Asian Paints: టీవీ స్టార్స్‌తో ప్రమోషన్.. ఏషియన్ పెయింట్స్ మెగా ప్లాన్!

Asian Paints

Asian Paints

Asian Paints: సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటాయి. క్రికెటర్లనో, సినిమా స్టార్స్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతుంటాయి. కానీ గత కొంతకాలంగా బ్రాండింగ్ ప్రమోషన్స్ లో కంపెనీల పంథా మారుతోంది. సోషల్ మీడియాతో పాటు టీవీ వ్యూయర్ షిప్ పై ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా ప్రముఖ కంపెనీ ఏషియన్ పెయింట్స్ (Asian Paints) టీవీ సీరియల్స్ చూసే వీక్షకులే లక్ష్యంగా తమ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తోంది. తాజాగా తెలుగు టెలివిజన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రేమి విశ్వనాథ్, అమూల్య గౌడ, పల్లవి రామిశెట్టిలతో బ్రాండింగ్ ప్రమోషన్స్ కోసం ఒప్పందం చేసుకుంది.

ఈ ముగ్గురు నటించే సీరియల్ సెట్ లోకేషన్లతో కలిసి బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటోంది. తాజాగా ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ ఎమల్షన్ గ్రుహశోభ పేరుతో ఒక విభిన్నమైన కలర్ షేడ్ గైడ్‌ను ప్రారంభించింది. ఈ గైడ్ ను ప్రేమి విశ్వనాథ్, అమూల్య గౌడ, పల్లవి రామిశెట్టిలతో కలిసి కంపెనీ ఎండీ అమిత్ సింగ్లే ఆవిష్కరించారు.

Also Read: GST Revision: సామాన్యుల‌పై మ‌రో పిడుగు.. వీటి ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం?

తెలుగు రాష్ట్రాల ప్రజలతో మమేకమైన టీవీ సీరియల్స్ నటులతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడంపై అమిత్ సింగ్లే సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలకు సైతం చేరువలో ఉండేవి టీవీ సీరియల్సేనని, అందుకే ఆ సీరియల్ స్టార్స్ తో ప్రమోషన్స్ కు ప్లాన్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ గైడ్ ప్రతి ఇంటికి సరికొత్త శోభను తీసుకొస్తుందని చెప్పారు.

80 ఏళ్ళుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు చెబుతూ 2000 పైగా షేడ్స్, అనేక ఫినిష్ వేరియంట్లతో ట్రాక్టర్ ఎమల్షన్ వినియోగదారులకు అందుబాటులో తెచ్చామని తెలిపారు. ఇక ఏషియన్ పెయింట్స్ లాంటి పెద్ద కంపెనీ షేడ్ గైడ్ లో తమ ఫోటోలు చూసుకోవడం ఎంతో ఎమోషనల్ గా ఉందని సీరియల్ స్టార్స్ ప్రేమి విశ్వనాథ్, అమూల్య గౌడ, పల్లవి రామిశెట్టి చెబుతున్నారు.