Project Tiger: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్

1973లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు టైగర్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది, ప్రాజెక్ట్‌ టైగర్‌ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ, మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు.

  • Written By:
  • Updated On - April 9, 2023 / 04:37 PM IST

Project Tiger : భారతదేశంలో క్రమంగా తగ్గుతున్న పులుల జనాభాను కాపాడే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. 1973లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు టైగర్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది, ప్రాజెక్ట్‌ టైగర్‌ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ, మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ టైగర్ (Project Tiger) ని ప్రారంభించారు. ఇది 18, 278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో 3000 పులులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభాలో 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి పులుల సంఖ్య వృద్ధి చెందుతుంది. ఈ మేరకు ప్రతి ఏడాది దేశంలో 6 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతుంది.

ప్రాజెక్ట్‌ టైగర్‌’కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో సఫారీకి వెళ్లారు. అందులో భాగంగా పులుల గణన డేటాను బయటపెట్టారు. నిన్న శనివారం హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం చెన్నై వెళ్లారు. నేడు ఆదివారం మోదీ కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ లో పర్యటించి పులుల డేటాని విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. పెద్ద పులుల సంరక్షణకు భారత్ ఎంతో కృషి చేసిందని అన్నారు. ప్రపంచంలోనే భారత్ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు.

ప్రాజెక్ట్ టైగర్‌ను 1973లో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రారంభించింది. 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో పులుల జనాభా 20000 నుండి 40000 వరకు ఉంది. మహారాజులు మరియు బ్రిటీష్ వారు వేటాడటం కారణంగా, డెబ్బైలలో వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఆహారం కొరత కారణంగా మరికొంత నష్టం జరిగింది.

Also Read:  Sitara Post: సితార పోస్ట్ పై నెటిజన్లు ఫైర్..