Site icon HashtagU Telugu

Mumbai: విమానంలో డాక్టర్ పై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. చివరికి?

Mumbai

Mumbai

రోజు రోజుకి సమాజంలో మహిళలకు రక్షణ అన్నది లేకుండా పోతోంది. ఇంటా, బయట, ఆఫీసులలో, స్కూళ్లలో, హాస్పిటల్స్ లో ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా మహిళలపై లైంగిక వేధింపులు లైంగిక దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి వాహనాలలో కూడా విడిచి పెట్టడం లేదు కామాంధులు. ట్రైన్ లలో బస్సులతో పాటు ఇప్పుడు ఏకంగా విమానాల్లో కూడా విసిగించడం మొదలుపెట్టారు. తాజాగా కూడా ఒక వ్యక్తి విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి సదరు ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు.

తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈమెకు పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. తాజాగా బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఒక విమానంలో 47 ఏళ్ల వ్యక్తి ప్రొఫెసర్ 24 ఏళ్ళ పక్కపక్కన సీట్లలో కూర్చున్నారు. అయితే ప్రయాణం మొదలైంది మొదలు అప్పటి నుంచి ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతో పాటుగా ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే సదరు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు ప్రొఫెసర్ కీ శిక్ష పడేలా చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version